Power Cut
Power Cut | రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

అక్షరటుడే ఇందూరు: Power Cut | నగరంలోని వినాయక్ నగర్ (Vinayak nagar) ఉపకేంద్రం (Sub station) పరిధిలో సోమవారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అసిస్టెంట్​ డివిజనల్​ ఇంజినీర్​ చంద్రశేఖర్​ తెలిపారు.

కొత్త 33కేవీ (33KV) టవర్ నిర్మాణ పనులు చేస్తున్నందున సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆయన వివరించారు. 100 ఫీట్ రోడ్, కామాక్షి, సాయి నిలయం, మీనాక్షి, పద్మావతి అపార్ట్​మెంట్​, భవానీనగర్​లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.