అక్షరటుడే, నిజాంసాగర్ : Power Cut | నిజాంసాగర్ విద్యుత్ ఫీడర్ లైన్ మరమ్మతుల నేపథ్యంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో కరెంట్ ఉండదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ఫీడర్ హెడ్లూయిస్ సబ్స్టేషన్ నుంచి 33కేవీ పిట్లం సబ్ స్టేషన్ వరకు ఫీడర్ లైన్ మరమ్మతులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఉదయం 06.30 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. మల్లూరు, నర్సింగ్రావుపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో గల మల్లూరు, మల్లూరు తండా, వడ్డేపల్లి, వడ్డేపల్లి తండా, జక్కపూర్, నారింగరావు పల్లి, మంగలూరు, వెల్గనూర్ గ్రామాల్లో కరెంట్ ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.
