అక్షరటుడే, బాన్సువాడ: Desaipet | విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే శాఖాధికారులు నిర్లక్ష్యం వహించారు. దేశాయిపేట్లో గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం గ్రామంలో విద్యుత్ సరఫరాకు Electricity supply అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్థులు సంబంధిత శాఖ లైన్మన్ను సంప్రదిస్తే దురుసుగా సమాధానం ఇచ్చాడని వారు వాపోయారు.
ఉన్నతాధికారులకు సంప్రదిస్తే గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ Transformer బిగిస్తున్నందున కరెంట్ సరఫరా నిలిపేశారని వివరించారు. ఒక్క ట్రాన్స్ఫార్మర్ బిగిస్తే గ్రామం మొత్తం సరఫరా నిలిపేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.