అక్షరటుడే, నిజాంసాగర్: Power Cut | సబ్స్టేషన్ల పరిధిలో మరమ్మతుల కారణంగా మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నిజాంసాగర్ మండల విద్యత్ శాఖాధికారి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పిట్లం (Pitlam), మల్లూరు (Mallur), నర్సింగ్‌రావు పల్లి (Narsingrao Palli) సబ్స్టేషన్ల పరిధిలోని మల్లూరు, మల్లూరు తండా, వడ్డేపల్లి తండా, జక్కాపూర్, నర్సింగ్‌రావు పల్లి, మంగళూరు, వెల్గనూర్ గ్రామాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.
