అక్షరటుడే, మెండోరా: Sriram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు విద్యుద్యుత్పత్తి కేంద్రంలో (Sriram Sagar Project Power Plant) ఉత్పత్తి కొనసాగుతోంది. మొత్తం నాలుగు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి (power generation) కొనసాగుతోందని డీఈ శ్రీనివాస్ తెలిపారు.
ఒకటో టర్బయిన్ ద్వారా 9.10 మిలియన్ వాట్స్, రెండో టర్బయిన్ ద్వారా 9.15 మిలియన్ వాట్స్, మూడో టర్బయిన్ ద్వారా 9.05 మిలియన్ వాట్స్, నాలుగో టర్బయిన్ ద్వారా 9.10 మిలియన్ వాట్స్ కలిపి మొత్తం నాలుగు టర్బయిన్ల ద్వారా 36.40 మిలియన్ వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. కాగా.. గత నెల రోజుల్లో 15.7788 మిలియన్ యూనిట్స్ ఉత్పత్తి అయినట్లు వివరించారు. ఈ యేడు 31.8352 మిలియన్ యూనిట్స్ ఉత్పత్తి చేసినట్లు చెప్పారు.