అక్షరటుడే, ఇందూరు: Power Cut | నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్‌కో (Transco) ఏడీఈ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన వివరించారు.
33 కేవీ కొత్త టవర్ నిర్మాణం కోసం 33/11 కేవీ బోర్గాం ఉపకేంద్రం (Borgam Substation) నుంచి 11కేవీ మహాలక్ష్మి నగర్ (Mahalaxmi Nagar) ఫీడర్లో పరిధిలో మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. దీంతో అమ్మ వెంచర్ (Amma Venture), న్యూ హౌసింగ్ బోర్డు, ఆర్య నగర్లో కొంత భాగంలో కరెంట్ ఉండదని వివరించారు. అలాగే ఎల్జీ స్విమ్మింగ్ పూల్ (LG Swimming Pool), బ్యాంక్ కాలనీ (bank colony), బస్వాగార్డెన్ (baswa garden), తుల్జా భవానీ టెంపుల్, గూడెం కాలనీ ప్రాంతాల్లో కరెంట్ సప్లయ్‌లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
