అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) లాభాల బాటలో సాగుతోంది. ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐతోపాటు ఆటో స్టాక్స్ ప్రధాన సూచీలను ముందుకు తీసుకువెళ్తున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 71 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా 191 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 537 పాయింట్లు పెరిగింది.
నిఫ్టీ (Nifty) 9 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే నష్టాల్లోకి జారుకుని 37 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి పుంజుకుని 154 పాయింట్లు లాభపడిరది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 354 పాయింట్ల లాభంతో 85,542 వద్ద, నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 26,264 వద్ద ఉన్నాయి. ఐటీసీలో వరుసగా రెండో సెషన్లోనూ పతనం కొనసాగుతోంది. రెండు రోజుల్లో సుమారు 14 శాతం వరకు షేరు ధర తగ్గింది.
ఎఫ్ఎంసీజీలో కొనసాగిన సెల్లాఫ్..
ఎఫ్ఎంసీజీ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.15 శాతం నష్టంతో ఉంది. యుటిలిటీ 1.69 శాతం, పవర్ 1.34 శాతం, రియాలిటీ 1.28 శాతం, పీఎస్‌యూ 1.24 శాతం, ఇన్ఫ్రా 1.16 శాతం, మెటల్ 1.04 శాతం, ఆటో 0.96 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.88 శాతం, ఎనర్జీ 0.76 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.72 శాతం లాభాలతో సాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.62 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.61 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 కంపెనీలు లాభాలతో ఉండగా.. 4 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఎన్టీపీసీ 3.12 శాతం, ట్రెంట్ 2.19 శాతం, పవర్‌గ్రిడ్ 1.80 శాతం, బీఈఎల్ 1.71 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.52 శాతం లాభాలతో ఉన్నాయి.
Losers : ఐటీసీ 3.92 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.49 శాతం, ఎయిర్టెల్ 0.40 శాతం, టైటాన్ 0.09 శాతం నష్టాలతో ఉన్నాయి.