అక్షరటుడే, కమ్మర్పల్లి: kammarpally | కమ్మర్పల్లి నుంచి మెడ్‌పల్లి జాతీయ రహదారికి (Medpally National Highway) ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. రహదారిపై గుంతలు ఏర్పడ్డాయని.. మూలమలుపుల వద్ద చెట్లు రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంటూ అక్టోబర్ 29వ తేదీన ‘గుంతలమయంగా మారిన పెర్కిట్-మెట్పల్లి రహదారి (Perkit-Metpally road) ’ శీర్షికతో ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది.
దీనికి తోడు ఈ సమస్యపై మంగళవారం కమ్మర్పల్లి వీడీసీ ఆధ్వర్యంలో రోడ్డు బాగుకోసం ధర్నాకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు స్పందించారు. జాతీయ రహదారి మరమ్మతులు ప్రారంభించారు. దీంతో కమ్మర్పల్లి వీడీసీ ఛైర్మన్ రామస్వామి, ఏఎంసీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య, గ్రామస్థులు ఉట్నూరు రాజేశేఖర్, బుచ్చి మల్లయ్య, రాజ్‌కుమార్, చింతప్రవీణ్, పాలెపు రాజేష్, గంగారాం, నరేందర్, నర్సయ్య, సతీష్ గాంధీనగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ‘అక్షరటుడే’కు కృతజ్ఞతలు తెలియజేశారు.