అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Roads Damage | రోడ్లు అధ్వానంగా మారడంతో వాహనదారులకు అవస్థలు తప్పవడంలేదు. నగర శివారులోని నాగారం నుంచి కొత్తపేట్ వరకు రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ గుంతల్లో పడి వాహనాలు పాడవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
Roads Damage | ప్రధాన రహదారి అయినా పట్టించుకోరా..
నాగారం మీదుగా బాన్సువాడ, వర్ని, నస్రుల్లాబాద్లకు ఆర్టీసీ బస్సులు (RTC bus) వెళ్తుంటాయి. అలాగే ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. మూములు రోజుల్లోనే ఈ రహదారిపై గుంతలు ఉండగా.. వర్షం కారణంగా ఇవి మరింత పెద్దవిగా మారాయి. బైక్‌లపై వెళ్లే పలువురు ప్రయాణికులు ఇటీవల ఈ గుంతల్లో పడి గాయాలపాలయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు.
Roads Damage | నాగారం నుంచి కొత్తపేట్ వరకు..
ముఖ్యంగా నాగారం ప్రాంతం నుంచి మల్లారం గండి.. కొత్త పేట్ వరకు రహదారి మరింత అధ్వానంగా మారింది. అడుగు అడుగుకో గుంత ఉండడంతో వాహనాలను ఎలా నడిపించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. రాత్రివేళ్లలో ప్రయాణం మరింత భయానకంగా మారిందని పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.