అక్షరటుడే, కోటగిరి: Pothangal Sarpanchs Forum | పోతంగల్ మండల సర్పంచ్ల ఫోరం సంఘం అధ్యక్షుడిగా సుంకిని సర్పంచ్ ఎస్ షాజీ పటేల్ ఎన్నికయ్యారు. మండల కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో సర్పంచ్ల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. అనంతరం కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన సంఘం..
సంఘం ఉపాధ్యక్షుడిగా విజయ్, కార్యదర్శిగా ఫిరోజ్, కోశాధికారిగా సునీల్, సలహాదారులుగా కనకమేడల శ్రీనివాసరావు, రాజు, రాంరెడ్డి సంజీవ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షాజీ పటేల్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచ్లకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి..
సర్పంచులందరూ ఐక్యంగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని షాజీ పటేల్ అన్నారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy), రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్(Agro Industries) ఛైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ(DCCB) ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సహకారంతో ఈ కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంధపు పవన్, ఎజాజ్ ఖాన్, గంగాధర్, శివాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.