అక్షరటుడే, నిజాంసాగర్: Mahammad Nagar | కొత్తగా ఏర్పాటైన మహమ్మద్‌నగర్ రెవెన్యూ మండలానికి 13 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రెవెన్యూ కార్యాలయంలో (Revenue Office) తహశీల్దార్ (Tahsildar), డిప్యూటీ తహశీల్దార్‌తో పాటు ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (Revenue Inspectors), సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, సర్వేయర్ (Surveyor), చైన్మన్, ముగ్గురు అటెండర్ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Mahammad Nagar | పోస్టింగ్‌లు ఇచ్చేందుకు మార్గం సుగమం..
మండల రెవెన్యూ కార్యాలయానికి సరిపడా పోస్టులు మంజూరు కావడంతో పోస్టింగులు ఇవ్వడానికి ఉన్నతాధికారులకు మార్గం సుగమమైంది. ఇంతకాలం డిప్యూటేషన్‌పై (Deputation) ఒకరిద్దరు అధికారులు, సిబ్బందితో కార్యాలయంలో పనులను నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పూర్తిస్థాయి సిబ్బంది వచ్చినట్లయితే పనులు సజావుగా జరుగుతాయని మండలవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్‌నగర్ తహశీల్దార్ కార్యాలయానికి నూతన పోస్టులు మంజూరు కావడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
