HomeUncategorizedShubhaanshu Shukla | ఏడోసారి వాయిదానే.. శుభాన్షు శుక్లా అంతరిక్ష ప‌ర్య‌ట‌న వాయిదా

Shubhaanshu Shukla | ఏడోసారి వాయిదానే.. శుభాన్షు శుక్లా అంతరిక్ష ప‌ర్య‌ట‌న వాయిదా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shubhaanshu Shukla | భార‌త వ్యోమ‌గామి శుభాన్షు శుక్లా అంత‌రిక్ష యాత్ర(Space travel) మ‌రోసారి వాయిదా ప‌డింది. నాసా చేప‌ట్టిన యాక్సియమ్-4 మిషన్ వ‌రుస‌గా ఏడోసారి వాయిడా పడింది. ఈ మేరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా(Indian astronaut Subhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే వివిధ కార‌ణాల‌తో ఆరుసార్లు వాయిదా ప‌డిన యాక్సియ‌మ్‌-4 మిష‌న్ రానున్న ఆదివారం చేపట్టాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా వేసిన‌ట్లు ఐఎస్ఎస్ తెలిపింది. వాస్త‌వానికి మొదట మే 29న జరగాల్సిన ఈ ప్రయోగానికి అవాంత‌రాలు ఎదుర‌వుతూనే ఉన్నాయి. జూన్ 8 నుంచి 10, 11, 19, 22 తేదీలకు వాయిదా వేశారు. అయితే, ఫాల్కన్ 9 రాకెట్ సంసిద్ధతలో జాప్యం, అననుకూల వాతావరణ పరిస్థితులు, ద్రవ ఆక్సిజన్ లీక్, అంతరిక్ష కేంద్రం సేవా మాడ్యూల్‌లో సాంకేతిక లోపం వంటి వివిధ సాంకేతిక, పర్యావరణ సమస్యల కారణంగా వాయిదాలు పడ్డాయి. త‌దుప‌రి మిష‌న్ ఎప్పుడు చేప‌ట్టేది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని పేర్కొంది. ఈ మిష‌న్ చేప‌ట్టేందుకు ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు అవ‌కాశ‌ముంది.

Shubhaanshu Shukla | పొర‌పాట్ల‌కు తావు లేకుండా..

నాసా, స్పేస్ ఎక్స్ భాగస్వామ్యంతో యాక్సియమ్ స్పేస్(Axiom Space) అనే ప్రైవేటు సంస్థ ఈ మిషన్ చేపడుతోంది. ఇందులో భాగంగా నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(International Space Station)లో కొన్ని రోజులపాటు పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు. వీరిలో భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు. ఈ మిషన్‌కు నాసా మాజీ ఆస్ట్రొనాట్ పెగ్గీ విట్సన్(Former NASA astronaut Peggy Whitson) నేతృత్వం వహిస్తున్నారు. భారతీయ ఆస్ట్రొనాట్ శుభాన్షు శుక్లా మిషన్ పైలట్‌గా ఉన్నారు. పోలాండ్‌కు చెందిన ఆస్ట్రొనాట్ స్లావోజ్, హంగేరీకి చెందిన వ్యోమగామి టిబోర్ కాపూ కూడా ఈ మిషన్‌లో పాలు పంచుకుంటున్నారు.

ఇటీవల మ‌ర‌మ్మతుల త‌ర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని కార్యకలాపాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా జ్వెజ్డా సర్వీస్ మాడ్యూల్(Zvezda Service Module) వెనుక విభాగానికి ఇటీవల జరిగిన మరమ్మతుల తరువాత, NASA పరిస్థితిని అంచనా వేస్తున్న తరుణంలో మిష‌న్ వాయిదా వేయాల్సి వచ్చింది. యాక్సియ‌మ్‌-4 మిషన్‌ను విజయవంతం చేయ‌డ‌మే లక్ష్యంగా పని చేస్తున్న నాసా, స్పేస్ ఎక్స్, యాక్సియమ్ స్పేస్ సంస్థలు పొరపాట్లకు తావు లేకుండా ప‌టిష్ట చర్యలు తీసుకుంటున్నాయి.

యాక్సియమ్-4 మిష‌న్‌ను చేపట్టేందుకు జూన్ 30 వరకూ అవకాశం ఉంది. ఈ గడువు దాటితే మళ్లీ 15 రోజులకే ప్రయోగం చేపట్టే అవకాశం వస్తుంది. ఇక యాక్సియమ్-4 ఆస్ట్రొనాట్స్‌ మే 14 నుంచి క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. వారి క్వారంటైన్ మరికొన్ని రోజులు కొనసాగనుంది. అన్ని మెడికల్, సేఫ్టీ ప్రొటొకాల్స్(Safety protocols) యథాతథంగా కొనసాగుతాయని ఐఎస్ఎస్ వెల్లడించింది.