అక్షరటుడే, ఇందూరు: Legal Metrology | జిల్లా కేంద్రంలో ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితి, భారత వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తూనికలు, కొలతల్లో మోసాలపై చైతన్య కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెటింగ్ శాఖ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి అపర్ణ హాజరయ్యారు. అనంతర వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ అసిస్టెంట్ సెలక్షన్ గ్రేడ్ ఆఫీసర్ శ్రీధర్, దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమితి ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ చారి, ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా ఉపాధ్యక్షుడు విఎన్ వర్మ, సంయుక్త కార్యదర్శులు శ్రీనివాస్, రత్నాకర్, తదితరులున్నారు.