Homeజిల్లాలుకామారెడ్డిMid day meals | మధ్యాహ్న భోజన ఏజెన్సీల సమస్యలు పరిష్కరించాలని పోస్టుకార్డు ఉద్యమం

Mid day meals | మధ్యాహ్న భోజన ఏజెన్సీల సమస్యలు పరిష్కరించాలని పోస్టుకార్డు ఉద్యమం

మధ్యాహ్న భోజన ఏజెన్సీల సమ్యలు పరిష్కరించాలని ఏజెన్సీల నిర్వాహకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఎల్లారెడ్డిలో తమ సమస్యలను పోస్టుకార్డుపై రాసి సీఎం రేవంత్​రెడ్డికి పంపారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mid day meals | మధ్యాహ్న భోజన ఏజెన్సీల (mid-day meal agencie) సమస్యలు పరిష్కరించాలని ఏజెన్సీ నిర్వాహకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం తమన సమస్యలను పోస్టుకార్డుపై రాసి సీఎం రేవంత్​రెడ్డికి (CM Revanth Reddy) పంపే కార్యక్రమం నిర్వహించారు.

ఎల్లారెడ్డి మండల కమిటీ (Yellareddy Mandal Committee) ఆధ్వర్యంలో సమస్యలను కార్డుపై రాసి పోస్ట్​బాక్స్​లో వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లుల బకాయిలు రూ.8కోట్లకు పైగా ఉన్నాయన్నారు. వాటిని విడుదల చేయకపోవడంతో ఏజెన్సీలు అప్పులు చేసి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నాయని వాపోయారు.

ప్రతి విద్యార్థికి రూ.25 స్లాబ్ రేటు ఇవ్వాలని.. లేదా నిత్యావసర వస్తువులు కోడిగుడ్లు గ్యాస్​ను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్​ చేశారు. కార్మికులకు రూ.10,000 వేతనం ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం, పీఎఫ్​, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు సోఫియా, మండల అధ్యక్షురాలు హేమలత, సంగీత, బద్యానాయక్​, విమల, అంజమ్మ, సోకబ్జి పాల్గొన్నారు.

Must Read
Related News