Homeజిల్లాలుకామారెడ్డిJukkal MLA | తపాలా శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు

Jukkal MLA | తపాలా శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు

తపాల సేవలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు పేర్కొన్నారు. పెద్దకొడప్​గల్​ మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో పోస్ట్​ ఆఫీస్​ను ఆయన ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే,పెద్ద కొడప్​గల్​: Jukkal MLA | ప్రజలు తపాలా శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు (MLA Thota Lakshmi Kantarao) పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో (Burugupalli village) బుధవారం తపాలా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ బురుగుపల్లి గ్రామంలో తపాలా కార్యాలయం (post office) ఏర్పాటు చేయడంతో ప్రజలకు తపాలా సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయన్నారు. పింఛన్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన డబ్బులు ఇప్పటినుంచి బూరుగుపల్లిలోనే తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజలందరూ తపాలా కార్యాలయంలో కొత్తగా ఖాతాను తీసుకోవాలన్నారు.

ఆడపిల్లలపై సుకన్య యోజన పథకంలో (Sukanya Yojana scheme) డబ్బులను జమ చేసి వారి విద్యాభ్యాసానికి వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ బీపీఎం తపాలా కార్యాలయం ద్వారా సమకూరే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్​ జనార్దన్ రెడ్డి, తపాలా కార్యాలయం సిబ్బంది, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్, శ్యామప్ప పటేల్, నాగిరెడ్డి, నారాయణరావు, శ్రీహరి, మారుతి తదితరులు పాల్గొన్నారు.