HomeజాతీయంPostal Services | ఇక ఫోన్‌లోనూ పోస్టల్‌ సేవలు..

Postal Services | ఇక ఫోన్‌లోనూ పోస్టల్‌ సేవలు..

పోస్టల్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోస్టల్‌ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. సేవలను మరింత వేగంగా అందించేందుకు కొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. తపాలా శాఖ అందించే సేవలన్నీ ‘డాక్‌ సేవ’ యాప్‌ ద్వారా అందుబాటులో ఉండనున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Postal Services | భారత తపాలా శాఖ (India Post) కోర్‌ పోస్టల్‌ సేవలను మరింత సులభతరం చేసేందుకు మొబైల్‌ అప్లికేషన్‌ను తీసుకువచ్చింది. డాక్‌ సేవా(DAK SEWA) పేరుతో తీసుకువచ్చిన ఈ అప్లికేషన్‌ను ‘మీ పాకెట్‌లో మీ పోస్ట్‌ఆఫీస్‌’ అని అభివర్ణించింది.

ఈ యాప్‌ ద్వారా సంప్రదాయ పోస్టల్‌ సేవలను దేశంలో ఎక్కడినుంచైనా యాక్సెస్‌ చేయవచ్చు. స్పీడ్‌పోస్ట్‌, రిజిస్టర్డ్‌ పోస్టు, పార్సిల్‌ బుకింగ్‌ (Parcel Booking) సేవలకోసం క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. జీపీఎస్‌ సాయంతో సమీపంలోని పోస్టాఫీసుల వివరాలను తెలుసుకోవచ్చు. పార్శిల్‌ ట్రాకింగ్‌, దేశీయ, అంతర్జాతీయ కన్సైన్‌మెంట్‌ కోసం పోస్టల్‌ చార్జీల లెక్కింపు, బీమా ప్రీమియం(Insurance Premium) చెల్లింపులు, ఫిర్యాదుల నమోదు వంటి విస్తృత శ్రేణి పోస్టల్‌ యుటిలిటీ సేవలన్నీ ఒకే ఫ్లాట్‌ఫాంపై లభించనున్నాయి.

Postal Services | డౌన్‌లోడ్‌ ఇలా..

డాక్‌ సేవా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం చాలా సులభం. గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌లోకి వెళ్లి డీఏకే ఎస్‌ఈడబ్ల్యూఏ(డాక్‌ సేవా) అని టైప్‌ చేయాలి.డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో ఉన్న అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.యాప్‌ను ఓపెన్‌ చేసి మొబైల్‌ నంబర్‌ లేదా ఇ-మెయిల్‌ ఐడీతో రిజిస్టర్‌ కావాలి. ఓటీపీ(OTP) ద్వారా లాగిన్‌ అయ్యి సేవలను వినియోగించుకోవచ్చు.పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ www.indiapost.gov.in ను సందర్శించండి.