అక్షరటుడే,ఇందూరు: Postal Department | ఉమ్మడి జిల్లాలోని తపాలాశాఖలో రానున్న రోజుల్లో కొత్త సాఫ్ట్వేర్ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి గురువారం పోస్టల్ ఉద్యోగులకు (Postal employees) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జనార్ధన రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడిజిల్లాలోని 3 హెడ్ పోస్టాఫీసుల్లో, 60 సబ్ పోస్ట్ ఆఫీసులు, 419 బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో ఈ సౌకర్యం రానుందన్నారు.
Postal Department | పోస్టల్ శాఖలో ఐటీ 2.0 ద్వారా సేవలు..
ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం పైలట్ ప్రాజెక్ట్‌గా నల్గొండ జిల్లాను ఎంపిక చేశారన్నారు. అక్కడ కొత్త సాఫ్ట్వేర్ సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈనెల 22వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుందన్నారు.
Postal Department | ఈనెల 22వ తేదీ నుంచి అమలు..
రాష్ట్రంలోని మిగతా అన్నీ జిల్లాల్లో ఈనెల 22వ తేదీనుండి ఈ IT 2.0 ద్వారా తపాలా సేవలు అందించబడతాయని ఆయన పేర్కొన్నారు. పోస్టాఫీసుల్లోని అన్ని సేవలు కొత్త సాఫ్ట్వేర్ ద్వారానే పనులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ స్టాఫ్ట్వేర్ను అప్డేట్ చేసిందని పేర్కొన్నారు.
Postal Department | 21న పోస్టల్ సేవలు బంద్..
కొత్తగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్న సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఈనెల 21వ తేదీన పోస్టాఫీస్‌లలో సేవలు నిలుపేస్తున్నట్లుగా ఆయన వివరించారు. దీనికి సంబంధించి 18, 19 తేదీల్లో ప్రిపరేటరీ వర్క్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించాలనే సదుద్దేశంతో ఈ మార్పు జరుగుతోందన్నారు. కార్యక్రమంలో పోస్టల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.