అక్షరటుడే, న్యూఢిల్లీ: Speed Post | రిజిస్టర్ పోస్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అధికారులకు, ప్రభుత్వ పరంగా నిర్వహించే పోస్టులకు దీని అవసరం ఎంతగానో ఉంటుంది.
ఎంతో ముఖ్యమైన రిజిస్టర్ పోస్టుపై పోస్టల్ శాఖ Postal Department కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్ పోస్టు registered post ను స్పీడ్ పోస్టులో కలిపేసింది. దీంతో నోటీసులు పంపేవారికి సమస్యగా మారింది.
ఎందుకంటే కొన్ని చట్టాల laws లో రిజిస్టర్ పోస్టులో మాత్రమే నోటీసులను పంపాలనే నిబంధన ఉంది. ఎందుకంటే రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపితే.. అందులో పేర్కొన్న వ్యక్తి మాత్రమే సంతకం చేసి ఆ పోస్టును తీసుకోవాలనే నిబంధన ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా తీసుకున్నట్లు ఒక ధ్రువీకరణగా భావిస్తారు.
కానీ, స్పీడ్ పోస్టులో ఈ నిబంధన లేదు. ఆ చిరునామాలో ఇస్తే సరిపోతుంది. ఈ క్రమంలో రిజిస్టర్, స్పీడ్ పోస్టుల కలయికపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్పీడ్ పోస్టులో కొన్ని ప్రత్యేక సర్వీసులను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
Speed Post | ఏడు రకాల సర్వీసులు..
ప్రజల సౌకర్యార్థం స్పీడ్ పోస్టులో 7 రకాల సర్వీసులు తీసుకొచ్చారు. అయితే వీటిని వినియోగించాలనుకుంటే అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఇది ముఖ్యంగా చట్టపరమైన విషయాలలో నోటీసులు ఇవ్వాలనుకుంటే ఇవి ఉపయోగపడతాయి. ఆ సర్వీసులు ఏమిటంటే..
- సాధారణ స్పీడ్ పోస్టు
- స్పీడ్ పోస్టు + రిజిష్ట్రేషన్
- స్పీడ్ పోస్టు + otp based delivery
- స్పీడ్ పోస్టు + proof of delivery
- స్పీడ్ పోస్టు + regn+ proof
- స్పీడ్ పోస్టు + otp + proof
- స్పీడ్ పోస్టు + రిజైన్ + otp + proof