అక్షరటుడే, ఇందూరు: Postal Ballot Lead | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (Nizamabad Municipal Corporation) కౌంటింగ్ కొనసాగుతోంది. 19వ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 68 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా.. బీజేపీకి 32 ఓట్లు, కాంగ్రెస్‌కి 31 ఓట్లు, బీఆర్ఎస్, ఏఐఎఫ్‌బీకి చేరో 2 ఓట్లు, నోటాకు ఒక ఓటు వచ్చాయి.
Postal Ballot Lead | కార్పొరేషన్లో ఆయా డివిజన్లలో..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 5వ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్ బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 40 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా.. బీజేపీకి 20 ఓట్లు, కాంగ్రెస్‌కి 16 ఓట్లు, ఏఐఎఫ్‌బీకి చేరో 3 ఓట్లు, బ్యాట్‌కు 1 నోటాకు ఒక ఓటు పోలయ్యాయి.
6వ డివిజన్లో..
6వ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్ బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 90 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా.. బీజేపీకి 60 ఓట్లు, కాంగ్రెస్‌కి 24 ఓట్లు, బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్ ఒక ఓటు పోలయ్యాయి.
7వ డివిజన్లో..
7వ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్ బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 81 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా.. బీజేపీకి 46 ఓట్లు, కాంగ్రెస్‌కి 25 ఓట్లు, బీఆర్ఎస్ 2, సీపీఎం 4, జనసేన ఒక ఓటు పోలయ్యాయి.
8వ డివిజన్లో..
8వ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్ బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 55 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా.. బీజేపీకి 42 ఓట్లు, కాంగ్రెస్‌కి 11 ఓట్లు, బీఆర్ఎస్ 1, బీఆర్ఎస్కు ఒక ఓటు పోలయ్యాయి.
కొనసాగుతున్న కౌంటింగ్..
నిజామాబాద్ జిల్లాలోని నగరపాలక సంస్థతో (Nizamabad Municipal Corporation) పాటు ఆర్మూర్ భీమ్‌గల్, బోధన్ మున్సిపాలిటీల లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. నగరానికి సంబంధించి పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతోంది. ఇందుకోసం 60 టేబుళ్లను, 230 మంది సిబ్బందిని నియమించారు. అలాగే బోధన్ మున్సిపాలిటీకి (Bodhan Municipality) సంబంధించి విజయ్ మేరీ పాఠశాలలో 38 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్మూర్‌లో 36 టేబుళ్లు, 130 మంది సిబ్బందిని నియమించారు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏడు గదుల్లో 36 టేబుళ్లు ఏర్పాటు చేసి 150మందిని నియమించారు. అలాగే భీమ్‌గల్‌లో 12 టేబుళ్లు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. నగరపాలక సంస్థ ఫలితాలు మాత్రం నాలుగు రౌండ్లలో తేలనున్నాయి.