అక్షరటుడే, కామారెడ్డి: NSUI Kamareddy | పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్‌కుమార్ (Irene Sandeep Kumar) కోరారు. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వెళ్తున్న పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) ఆదివారం కామారెడ్డిలోని షబ్బీర్ అలీ (Shabbir Ali) నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌ను పలువురు నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మహేష్‌కుమార్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.
పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటిందని, అయినా పార్టీలో చాలామందికి ఎలాంటి పదవులు రాలేదన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు పార్టీ అధికారంలో ఉన్నన్నిరోజులే ఇక్కడ ఉంటారని.. తాము మాత్రం ఏళ్లుగా పార్టీ జెండాలు మోశామని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో (Indiramma Housing committee) కూడా నిరుపేద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తనపై ఎన్నో కేసులు పెట్టారని, అరెస్టులు చేశారని ఆయినా బెదరలేదన్నారు. పార్టీకి విధేయులుగా ఉన్నవారికి మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరారు.