Homeక్రీడలుINDVsENG | భార‌త బౌల‌ర్స్‌ను ఓ ఆటాడుకుంటున్న పోప్, రూట్.. భారీ స్కోరు దిశ‌గా ఇంగ్లండ్..

INDVsENG | భార‌త బౌల‌ర్స్‌ను ఓ ఆటాడుకుంటున్న పోప్, రూట్.. భారీ స్కోరు దిశ‌గా ఇంగ్లండ్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDVsENG | మాంచెస్టర్ టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగిసేసరికి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. భారత్‌పై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ India 358 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత, ఇంగ్లండ్ బ్యాటర్లు దూకుడు ఆటతో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. రెండో రోజు లంచ్ తర్వాత ఇంగ్లింష్​ జట్టు ఓపెనర్లు డకెట్ (Duckett)(94), జాక్ క్రాలీ (Jack Crawley)(84) లు భారత బౌలర్లని ఓ ఆటాడుకున్నారు. వరుసగా బౌండరీలు బాదుతూ పరుగుల వర్షం కురిపించారు. అయితే, క్రాలీ జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డకెట్‌ను అన్షుల్ ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ త్రూ ఇచ్చాడు.

INDVsENG | రాణిస్తున్న బ్యాట‌ర్స్..

అయితే వారిద్ద‌రు ఔట్ అయినా కూడా జో రూట్ (Joe Root)(63 నాటౌట్), ఓలీ పోప్ (Ollie Pope) (70 నాటౌట్) జోడీ అద్భుతంగా క్రీజులో పాతుకుపోయి మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. పేస్ బౌలర్ల బౌన్స్‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటూ, స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ సులువుగా ఆడుతూ అర్ధశతకాలతో చెలరేగారు. మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ (England) 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 332 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చేసిన‌ స్కోర్ కంటే కేవలం 26 పరుగులు వెనుక మాత్రమే ఉంది. భారత బౌలర్లు రూట్-పోప్ జంటను విడదీయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Captain Shubman Gill) ఫీల్డింగ్ మార్చినా, బౌలింగ్ మార్పులు చేసినా ఫలితం కనిపించలేదు.

ఇప్పటికే ఇద్దరు సెటిల్ అయిన బ్యాటర్లు క్రీజులో ఉండడంతో ఇంగ్లండ్ మళ్లీ లీడ్ దిశగా దూసుకెళ్లే పరిస్థితిలో ఉంది. సిరీస్ తుది ఫలితంపై ప్రభావం చూపే ఈ టెస్టులో, భారత్‌కు తిరిగి గేమ్‌లోకి రావాలంటే ప్రత్యర్థి పటిష్ట భాగస్వామ్యాన్ని త్వరగా విడదీయాల్సిన అవసరం ఉంది.ఇప్ప‌టికే ఇంగ్లండ్ జ‌ట్టు రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉంది. భార‌త్ ఒక మ్యాచ్ గెలిచింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో (Five Test Series) భాగంగా జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ వారి సొంతం అవుతుంది.