ePaper
More
    HomeసినిమాActress Poorna | భార్య దూర‌మైంద‌ని భావోద్వేగానికి గురైన పూర్ణ భ‌ర్త‌.. ఇప్పుడు గుడ్ న్యూస్‌తో...

    Actress Poorna | భార్య దూర‌మైంద‌ని భావోద్వేగానికి గురైన పూర్ణ భ‌ర్త‌.. ఇప్పుడు గుడ్ న్యూస్‌తో స‌ర్‌ప్రైజ్ చేశారుగా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Actress Poorna | శ్రీమహాలక్ష్మి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Film Industry) అడుగుపెట్టిన నటి పూర్ణ ఈ మ‌ధ్య తెగ వార్త‌లలో నిలుస్తోంది. గ్లామర్, నటనలో తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో మరో అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభించనుంది.

    తన సెకండ్ ప్రగ్నెన్సీ (Second Pregnancy) విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించి, అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది. తాజాగా పూర్ణ తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. మా గుండెల్లో ఇప్పుడు సంతోషం నిండిపోయింది. మా కుటుంబంలోకి ఇంకొకరు రాబోతున్నారు. కొత్త నవ్వులు, చిన్ని అడుగుజాడలు మా జీవితాల్లోకి చేరబోతున్నాయి. ఈ గుడ్ న్యూస్ మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

    Actress Poorna | గుడ్ న్యూస్..

    పూర్ణ పోస్ట్‌కి స్పందించిన నెటిజన్లు, సినీ అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2022 జూన్ 12న దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పూర్ణ (Actress Poorna) వివాహబంధంలోకి అడుగుపెట్టింది. 2023 ఏప్రిల్‌లో దంపతులకు హమ్దాన్ అసిఫ్ అలీ అనే మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం వారు తమ కుటుంబంలోకి మరో బిడ్డ‌ని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆమెకు శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తోంది. ఒకప్పుడు సీమ టపాకాయ్, అవును వంటి హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా మెరిసిన పూర్ణ, ఇటీవల అఖండ, డెవిల్ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.

    పెళ్లి తర్వాత సినిమా అవకాశాలను తగ్గించి, ఎక్కువగా టీవీ షోలు , సోషల్ మీడియా మీద దృష్టి పెట్టింది. ఇటీవలి కాలంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో కనిపించిన పూర్ణ, ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో తక్కువగానే కనిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం పూర్ణ భర్త షానిద్ సోషల్ మీడియాలో భావోద్వేగ భరితంగా స్పందిస్తూ.. నా భార్య 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్ 2 సినిమా కోసం వేరే చోట ఉంది. మొత్తంగా 45 రోజులు నాకు దూరంగా ఉంది. పెళ్లయిన తర్వాత మేము ఎప్పుడూ ఇలా వేరుగా ఉండలేదు అంటూ పోస్ట్ చేసిన విషయం వైరల్ అయింది.

    Latest articles

    Nandamuri Balakrishna donation | వరద బాధిత రైతులకు అండగా బాలయ్య.. భారీ విరాళం ప్రకటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandamuri Balakrishna donation : అతి భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలం...

    Nizamabad | బోర్గాం(పి) పాఠశాలలో టీచర్​కు ఘనంగా​ వీడ్కోలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : Nizamabad | నిజామాబాద్​ నగరంలోని బోర్గాం(పి) జెడ్పీ హైస్కూల్‌ సోషల్‌ టీచర్‌ జ్యోతి ఉద్యోగ...

    Pavan Kalyan | దసరా తర్వాత త్రిశూల్‌ కార్యక్రమం.. డిప్యూటీ సీఎం పవన్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | రాజకీయాలు డబ్బు సంపాదించడం కోసం కాదని ఏపీ డిప్యూటీ సీఎం,...

    MLA KVR | పనిచేసిన వారిపై దుష్ప్రచారం తగదు: ఎమ్మెల్యే కేవీఆర్​

    అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR | వరద సమయంలో అధికారులతో పాటు తాను కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నానని.. పనిచేసే...

    More like this