HomeతెలంగాణBodhan | అందని వైద్యం.. గాలిలో కలిసిన ప్రాణం..

Bodhan | అందని వైద్యం.. గాలిలో కలిసిన ప్రాణం..

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Bodhan | ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. సమయానికి వైద్యం అందక నిండు ప్రాణం బలైంది.

వైద్యులు అందుబాటులో లేక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన బోధన్ పట్టణంలోని​ జిల్లా ఆస్పత్రిలో సోమవారం (Bodhan District Hospital) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వర్ని (Varni) మండల కేంద్రానికి చెందిన రుక్మిణికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబీకులు వెంటనే బోధన్​ జిల్లాస్పత్రికి తీసుకొచ్చారు. కానీ అత్యవసర చికిత్స అందించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడున్న సిబ్బంది తమకు తెలిసిన చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ, పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే సంబంధిత వైద్యులు చికిత్స అందించి ఉంటే ఆమె బతికేదని బంధువులు రోదిస్తూ పేర్కొన్నారు.