అక్షరటుడే, వెబ్‌డెస్క్: Poonam Kaur | గత కొద్ది రోజులుగా సినీ నటి పూనమ్ కౌర్.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan), త్రివిక్రమ్(Trivikram)లని టార్గెట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పూనమ్ కౌర్ రీసెంట్‌గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(AP Chief Minister Chandrababu)ను కలిసి నేపథ్యంలో ఆమె హాట్ టాపిక్ అయింది. ఈ పరిణామం తర్వాత త్రివిక్రమ్(Trivikram)తో సమస్య తీరిపోయిందని అందుకే పవన్ భాగస్వామి అయిన కూటమి సీఎంను పూనమ్ కలిసింది ఇకపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్లు వచ్చాయి.
Poonam Kaur | మళ్లీ మొదలు..
నెటిజన్లు అనుకున్నట్లు అలాంటిదేమి జరగలేదు. మళ్లీ పూనమ్ త్రివిక్రమ్ Trivikramని టార్గెట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నేను ఇది వరకే చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నాను.. నేను మెయిల్ ద్వారా కంప్లైంట్ చేశాను.. ఝాన్సీతో మాట్లాడాను.. ఆ తరువాత ఆమెను మళ్లీ కలవలేకపోయాను.. కాస్త బిజీగా ఉన్నారని, డిస్టర్బ్ చేయొద్దని అన్నారు.. నేను ఎవ్వరీ పేర్లు చెప్పలేదని అన్నారు.. నేను క్లియర్‌గా చెబుతున్నాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మీద నేను కంప్లైంట్ చేశాను.. ఎవరైతే రాజకీయ అండదండలతో తప్పించుకుంటున్నారో.. అతడి మీదే ఫిర్యాదు చేశాను.. మెయిల్ చేసినట్టుగానే ఉమెన్ టీంతో నేను మాట్లాడతాను.. థాంక్యూ’ అని పూనమ్ పోస్ట్ వేసింది.
పూనమ్ కౌర్ Poonam kaur గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ మీద ఎన్నో రకాల విమర్శలు చేసిన, సోషల్ మీడియాలో ఎన్ని ట్వీట్స్ చేసినా కూడా ఏ రోజు స్పందించలేదు. ఇప్పుడు తన దగ్గర ప్రూఫ్ ఉందంటూ పూనమ్ చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. అసలు ఈ గొడవ ఇలానే కొనసాగుతుందా, ఎప్పుడు చెక్ పడుతుంది అనే దానిపై క్లారిటీ లేదు.