ePaper
More
    HomeసినిమాPeddi Movie | పెద్ది సినిమాలో స్పెష‌ల్ సాంగ్ కోసం ఆ బ్యూటీని ప‌ట్టుకొస్తున్నారా.. ఇక...

    Peddi Movie | పెద్ది సినిమాలో స్పెష‌ల్ సాంగ్ కోసం ఆ బ్యూటీని ప‌ట్టుకొస్తున్నారా.. ఇక జాతరే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddi Movie | ఉప్పెన వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బుచ్చిబాబు రామ్ చ‌ర‌ణ్‌ Ram Charan క‌లిసి పెద్ది అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన విష‌యాలు ప్రేక్ష‌కుల‌లో ఆసక్తిని క‌లిగిస్తున్నాయి. ఇటీవ‌ల చ‌ర‌ణ్ లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహ ఆవిష్కరణకు చరణ్ హాజరయ్యారు. ఆ ఈవెంట్​లో పెద్ది సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చారు. పెద్ది చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు 30% పూర్తయిందని రామ్ చరణ్ వెల్లడించారు. రంగస్థలం కంటే పెద్ది మూవీ భారీగా ఉంటుందని , మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన తర్వాత అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగిందని చెప్పారు.

    Peddi Movie | క్రేజీ న్యూస్..

    పెద్ది Peddi మూవీ కూడా రంగ‌స్థ‌లం తరహాలో ఉండబోతుందని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే చరణ్ ఇచ్చిన అప్డేట్​తో పెద్ది రంగస్థలం కంటే భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) హీరోయిన్​గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు లాంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత​ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​(Mythri Movie Makers)తో కలిసి వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుద‌లైన గ్లింప్స్​ కేక పుట్టించింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ సిక్స‌ర్ కొట్టిన తీరు అదుర్స్. ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.” అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పే డైలాగ్స్ ఈలలు వేయించేలా ఉన్నాయి

    వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కానుండ‌గా, ఇది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. చిత్రంలో చరణ్ ఆట కూలీగా కనిపించనున్నాడని టాక్. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా Sports Drama ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంద‌ని అంటున్నారు. ఇక స్పెష‌ల్ సాంగ్ కూడా ప్లాన్ చేశార‌ని, ఆ సాంగ్ కోసం పూజా హెగ్డేని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లంలో పూజా స్పెష‌ల్ సాంగ్‌తో అద‌రగొట్టిన విష‌యం తెలిసిందే.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...