ePaper
More
    Homeక్రీడలుRicky Ponting | ఆసీస్ వెళ్లాల‌ని విమానం ఎక్కిన పాంటింగ్.. యుద్ధం ఆగింద‌ని త‌న‌తో పాటు...

    Ricky Ponting | ఆసీస్ వెళ్లాల‌ని విమానం ఎక్కిన పాంటింగ్.. యుద్ధం ఆగింద‌ని త‌న‌తో పాటు వారినీ దింపేశాడుగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ricky Ponting | భార‌త్ – పాక్(India-Pakistan) యుద్ధం వ‌ల‌న ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో మ‌నం చూశాం. ఐపీఎల్‌ని IPL కూడా మ‌ధ్య‌లోనే నిలిపివేశారు. వారం పాటు గ్యాప్ ఇచ్చామ‌ని చెప్పినా కూడా ఆపై మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి.. దీంతో విదేశీ ఆటగాళ్లకు ఎటూ పాలుపోలేదు. దీంతో తట్టాబుట్ట సర్దుకుని విమానం టికెట్ బుక్ చేసుకున్నారు. విదేశీ క్రికెటర్లు, సహాయక సిబ్బంది వారి స్వస్థలాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ప్రధాన కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) సైతం శనివారం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయం(Delhi Airport)లో విమానం ఎక్కారు. విమానం బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు కాల్పుల విరమణకు సంబంధించిన ప్రకటన రావ‌డంతో పాంటింగ్ వెంటనే విమానం దిగిపోయారు. ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

    Ricky Ponting | ఆగిపోయారు..

    అంతేకాదు పంజాబ్ Punjabజట్టుకు చెందిన విదేశీ ఆటగాళ్లను కూడా స్వదేశాలకు వెళ్లకుండా ఆపాడు. పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న మార్కస్ స్టోయినిస్, జాష్ ఇంగ్లీస్, బార్ట్‌లెట్, ఆరోన్ హార్టీ తమ స్వదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. వారి ప్రయాణం గురించి తెలుసుకున్న పాంటింగ్(Ponting) వారితో మాట్లాడాడు. కాల్పుల విరమణ గురించి చెప్పి వారిలో ధైర్యం నింపాడు. వారు భారత్‌లోనే ఉండేలా ఒప్పించాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే, పంజాబ్ జట్టులో కీలక ఆటగాడైన మార్కో యాన్సెన్ (దక్షిణాఫ్రికా) మాత్రం దుబాయ్ మీదుగా తన స్వదేశానికి వెళ్లిపోయారు.

    పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం నాటి మ్యాచ్​తోనే ఐపీఎల్(IPL) మధ్యలో ఆగిపోయింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Supergiants) ఆటగాళ్లు ఇప్పటికే తమదేశాలకు వెళ్లిపోయారు. ఉపఖండంలోని శ్రీలంక జట్టు ఆటగాళ్లకు ఇబ్బంది లేకున్నా.. ఇంగ్లండ్ England, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన క్రికెటర్లకు యుద్ధం అంటే ఏమిటో తెలియదు. దశాబ్దాలుగా ఐపీఎల్​లో పాల్గొంటున్నా.. వారికి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. దీంతో తాజా పరిణామాలతో బెంబేలెత్తారు. మొత్తానికి యుద్ధం ముగిసింద‌న్న వార్త రావ‌డంతో చ‌ల్ల‌బ‌డ్డారు. రెండు రోజుల‌లో ఐపీఎల్‌పై క్లారిటీ రానుంది.

    Latest articles

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారుల...

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్...

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో...

    More like this