అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponnam Prabhakar | మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో నెలకొన్న వివాదానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తెర దించారు. తాను ఆ వ్యాఖ్యలు అనలేదని, కానీ పత్రికల్లో వచ్చిన వార్తలతో అడ్లూరి లక్ష్మణ్ బాధ పడి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను రాజకీయ దురుద్దేశంతో వక్రీకరించారని పేర్కొన్నారు.
పొన్నం ఉదయం మాట్లాడుతూ.. అడ్లూరి లక్ష్మణ్‌తో (Adluri Lakshman) తనకు 30 ఏళ్ల అనుబంధముందని చెప్పారు. ఆయన మనసు నొచ్చుకున్నందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అడ్లూరి తనకు సోదర నమానుడని, ఆయనను కించపరిచే ఉద్దేశం లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు.
Ponnam Prabhakar | పొన్నం వర్సెస్ అడ్లూరి
మంత్రుల మధ్య చెలరేగిన వివాదం కాంగ్రెస్ పార్టీలో (Congress Party) కల్లోలం రేపింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా ఇటీవల జరిగిన విలేకరుల సమావేశానికి మంత్రులు పొన్నం, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ హాజరు కావాల్సి ఉంది. అయితే, మీడియా సమావేశానికి అడ్లూరి కాస్త ఆలస్యంగా రావడంతో పొన్నం ప్రభాకర్ వివేక్ చేవిలో ఆయన గురించి తప్పుగా మాట్లాడారు. ఆలస్యంగా రావడంపై అసహనం వ్యక్తం చేసిన పొన్నం.. అసహనంతో పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. మనకు సమయం తెలుసు.. జీవితం తెలుసు.. కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అంటూ మాట్లాడారు. అయితే, మైక్ ఆన్‌లో ఉండడంతో ఈ వ్యాఖ్యలు అక్కడున్న వారందిరకీ వినిపించాయి.
Ponnam Prabhakar | క్షమాపణ చెప్పాలన్న అడ్లూరి..
అయితే తనను మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అలా అనడం బాధ కలిగించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు తన సామాజిక వర్గాన్ని కించపరిచాయన్నారు. పొన్నం వ్యాఖ్యలను మరో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. పొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్‌లా తనకు అహంకారంగా మాట్లాడడం రాదని తెలిపారు. మంత్రి వివేక్ లాగా తన దగ్గర డబ్బులు లేవని స్పష్టం చేశారు. తాను మంత్రి కావడం, ఆ సామాజిక వర్గంలో పుట్టడం తన తప్పా.. అని ఆవేదన వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar | రాజీ కుదిర్చిన పీసీసీ..
మంత్రుల మధ్య వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పీసీసీ జోక్యం చేసుకుంది. మంత్రి అడ్లూరితో మాట్లాడిన పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ (PCC Chief Mahesh Goud) ఏం జరిగిందని ఆరా తీశారు. మరోవైపు మంత్రి పొన్నంతోనూ మాట్లాడారు. ఇరువురు మంత్రులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం బుధవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. అడ్లూరి మనసు నొచ్చుకుని ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. అయితే విచారం వ్యక్తం చేయడంపై అడ్లూరి సంతృప్తి చెందలేదు. దీంతో పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు నేతలతో భేటీ అయ్యారు. అనంతరం పొన్నం ప్రభాకర్ అడ్లూరికి క్షమాపణలు చెప్పారు. ‘‘నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం అడ్లురి లక్ష్మణ్ బాధపడిన దానికి క్షమాపణ కోరుతున్నా” అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
1 comment
[…] తెలిసింది. మరోవైపు, పొన్నం(Ponnam Prabhakar), వివేక్ కూడా అంజన్‌కుమార్ […]
Comments are closed.