అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Adluri Lakshman | మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. పొన్నం క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అడ్లూరి హెచ్చరించారు.
పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి (Minister Adluri) స్పందించారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా అని మంత్రి పొన్నంను ఆయన ప్రశ్నించారు. ‘‘ఆ మాటను సమర్థించుకొని ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నావు అంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్న”అని అన్నారు. సహచర మంత్రిని అంత మాట అంటే చూస్తూ ఉంటావా అంటూ మరో మంత్రి వివేక్‌ను (minister Vivek) సైతం ఆయన నిలదీశారు.
Minister Adluri Lakshman | అసలు ఏం జరిగిందంటే?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills constituency) పరిధిలోని రహమత్‌నగర్‌లో ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొనాల్సి ఉంది. అయితే అడ్లూరి ఆలస్యంగా వచ్చారు. దీంతో అసహనానికి లోనైనా పొన్నం పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. ‘‘మనకు సమయం తెలుసు.. జీవితం తెలుసు.. కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి’’ అంటూ మాట్లాడారు. ఆ టైమ్‌లో మైక్ ఆన్ ఉండటంతో ఆయన మాటలు బయటకు వినిపించాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Minister Adluri Lakshman | అధిష్టానానికి ఫిర్యాదు
తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన తనను తక్కువగా చూస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి తమ జాతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వచ్చి కూర్చుంటే వివేక్ వెళ్లిపోతున్నారని చెప్పారు. పొన్నం వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు (in-charge Meenakshi Natarajan) లేఖ రాశారు.
సోనియా గాంధీని, రాహుల్ గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున ఖర్గేను సైతం కలుస్తానన్నారు. బుధవారం లోగా పొన్నం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పొన్నం మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. తాను పక్కన ఉంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.