అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష (polytechnic common entrance examination) సందర్భంగా అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (police commissioner sai chaitanya) తెలిపారు. ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు పరీక్ష జరుగనుందన్నారు. మొత్తం 16 కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (section 163 BNSS) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల (exam centers) వద్ద గుమ్మిగూడరాదన్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అన్ని జిరాక్స్ సెంటర్లను ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మూసివేయాలన్నారు. ఈ ఉత్తర్వులు ఈనెల 13న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అమలులో ఉంటాయని సీపీ పేర్కొన్నారు.
Nizamabad CP | పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ సాయిచైతన్య
Published on
