అక్షరటుడే, కామారెడ్డి: Polycet Entrance Exam | ఉమ్మడి జిల్లాలో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కో–ఆర్డినేటర్లు జేఎం శ్రీనివాస్, విజయ్‌కుమార్ తెలిపారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్(Nizamabad), కామారెడ్డి (Kamareddy)లో కలిపి మొత్తంగా 22 సెంటర్లను కేటాయించామని వివరించారు.
నిజామాబాద్‌లో 16 సెంటర్లలో 6,540 మంది విద్యార్థులు, కామారెడ్డిలోని 6 సెంటర్లలో 2,900 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగనుందని, ఉదయం 10 గంటల నుంచే విద్యార్థులను సెంటర్లలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఒక్క నిమిషం లేటయినా హాల్లోకి అనుమతి లేదు.
అభ్యర్థులు తమ వెంట ఒక హెచ్‌బీ పెన్సిల్, బ్లాక్ ఆర్ బ్లూ పెన్, హాల్ టికెట్ తీసుకొని రావాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి వాచ్‌లు, మొబైల్ ఫోన్లు, పర్సులు, షూ, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించారన్నారు. హాల్‌టికెట్‌పై ఫొటోస్ స్పష్టంగా లేని అభ్యర్థులు గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా తమ ఫొటోని ధ్రువీకరణ చేయించుకోవాలని సూచించారు.