అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Telangana Formation Day | రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 37 సేవాపథకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ సీసీఎస్ విభాగంలో ఇన్స్పెక్టర్ పొల్లు రవీందర్ (CCS Inspector Pollu Ravinder) మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. గతంలోనూ ఆయన ప్రెసిడెంట్ మెడల్‌ను (President Medal) అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో పాటు రూ.40వేల క్యాష్ రివార్డ్, సర్టిఫికెట్‌ను అందుకున్నారు. కాగా.. మహోన్నత సేవా పతకాన్ని త్వరలో అందుకోనున్నారు.