అక్షరటుడే, ఇందూరు: Panchayat Elections | ఉమ్మడి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల (Panchayat election) పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని తొలి విడత పోలింగ్ జరుగుతున్న బోధన్ డివిజన్లో (Bodhan division) ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 11 మండలాల్లో ఉదయం 11 గంటల వరకు 50.73 శాతం ఓట్లు పోలయ్యాయి.
Panchayat Elections | బోధన్ మండలంలో..
బోధన్ మండలంలో (Bodhan mandal) 62.34 శాతం, చందూర్లో 48.54 శాతం, కోటగిరిలో 48.12 శాతం, మోస్రాలో 38.22 శాతం, పోతంగల్లో 53.03 శాతం, రెంజల్లో 58.93 శాతం, రుద్రూర్లో 55.85 శాతం, సాలూరలో 55.95 శాతం, వర్నిలో 54.91 శాతం, ఎడపల్లిలో 47.58 శాతం, నవీపేటలో 37.77 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 11 మండలాల్లో 2,42,723 ఓట్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,23,126 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసుల పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ జరుగుతోంది.