అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Polling percentage 3 pm | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు పోలింగ్ సరళిని పరిశీలించారు. ఉదయం మదకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు ఊపందుకుంది.
Polling percentage 3 pm | నిజామాబాద్ జిల్లాలో..
జిల్లాలో నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు మూడు మున్సిపాలిటీల్లో కలిపి మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 48.55 శాతం ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ కార్పొరేషన్లో 43.18 శాతం, ఆర్మూర్‌లో 60.07 శాతం, బోధన్‌లో 61.77 శాతం, భీమ్‌గల్‌లో 63.65 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా.. తొలి రెండు గంటల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైనా.. మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. జిల్లావ్యాప్తంగా 4,95,485 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 2,40,543 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి జిల్లాలో 59.90 శాతం నమోదైంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 1,49,525 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం 3 గంటల వరకు 89566 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 59.90 శాతం పోలింగ్ నమోదైంది. కామారెడ్డి మున్సిపాలిటీలో 99,313 మంది ఓటర్లకు 55,644 మంది ఓటు వేయగా 56.03 శాతం, ఎల్లారెడ్డిలో 13,265 మంది ఓటర్లకు 9,174 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 69.16 శాతం, బాన్సువాడలో 24,188 మంది ఓటర్లకు 15,585 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 64.43 శాతం, బిచ్కుంద మున్సిపాలిటీలో 12,789 మంది ఓటర్లకు 9,163 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా 71.82 పోలింగ్ శాతం నమోదైంది. నాలుగు మున్సిపాలిటీలలో బిచ్కుంద మున్సిపాలిటీ పోలింగ్ శాతంలో మొదటి స్థానంలో ఉండగా ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలలో 60 శాతం దాటింది. కామారెడ్డిలో 56.03 శాతం నమోదైంది.