అక్షరటుడే, ఇందూరు/కమ్మర్పల్లి : Panchayat Elections | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో ( ఉదయం 9 గంటల వరకు) 23.35 శాతం ఓటింగ్ నమోదైంది. ఆలూరు మండలం లో 25.63 శాతం, ఆర్మూర్లో 26.32 శాతం, బాల్కొండలో 23.04 శాతం, భీమ్గల్ మండలం (Bheemgal Mandal)లో 24.92 శాతం, డొంకేశ్వర్ మండలంలో 20.58 శాతం, కమ్మర్పల్లిలో 22.12 శాతం, మెండోరా 28.11 శాతం, మోర్తాడులో 21.46శాతం, ముప్కాల్ మండలంలో 21.6 శాతం, నందిపేట్ మండలంలో 24.34, వేల్పూర్లో 17.66 శాతం, ఏర్గట్లలో 24.82 శాతం ఓటింగ్ నమోదైంది.
Panchayat Elections | పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్
పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ పరిశీలించారు. కమ్మర్పల్లి (Kammarpally)లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ తీరును అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.