అక్షరటుడే, ఇందూరు : Sarpanch Elections | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) భాగంగా జిల్లాలోని తొలి విడత పోలింగ్ బోధన్ డివిజన్లో ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. మొత్తం 11 మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 19.80 శాతం ఓట్లు పోలయ్యాయి. బోధన్ మండలం (Bodhan Mandal)లో 26.26 శాతం, చందూర్లో 16.63 శాతం, కోటగిరిలో 17.76 శాతం, మోస్రా 15.42 శాతం, పోతంగల్ 19.76, రెంజల్ 23.99, రుద్రూర్ 10.38 శాతం, సాలూరు 24.30, వర్నిలో 19.62, ఎడపల్లి (Edapalli)లో 20.48 శాతం, నవీపేటలో 17.07 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Sarpanch Elections | కామారెడ్డిలో..
కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో ఉదయం 9 గంటల వరకు 19.70 శాతం పోలిగ్ నమోదు అయింది. భిక్కనూరు మండలంలో 21.22 శాతం, బీబీపేట 7.36, దోమకొండ 19.14, కామారెడ్డి 23.68, మాచారెడ్డి 19.46, పాల్వంచ 20.49, రాజంపేట 21.02, రామారెడ్డి 22.61, సదాశివనగర్ 20.96, తాడ్వాయి 18.76శాతం ఓటింగ్ నమోదు అయింది.