అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఎన్నికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈ వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులకు గతంలో గుర్తులు కేటాయించారు. ఈ మేరకు వారు ప్రచారం కూడా చేశారు. అయితే ఎన్నికల సంఘం (Election Commission) తరఫున పోలింగ్ కోసం వచ్చిన బ్యాలెట్ పేపర్లలో ఒక అభ్యర్థి గుర్తు రాలేదు. యాదయ్య గుర్తు బ్యాలెట్ పేపర్లో లేకపోవడంతో వార్డు ఓటర్లు గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వార్డులో ఎన్నికలను అధికారులు నిలిపివేశారు.
Panchayat Elections | తేలననున్న భవితవ్యం
మొదటి విడతలో మొత్తం 189 మండల్లాలోని 3,834 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వార్డు మెంబర్ల ఓట్లు కౌంటింగ్ చేసిన తర్వాత అధికారులు వారితో సమావేశం నిర్వహిస్తారు. అక్కడే ఉప సర్పంచ్ ఎన్నిక (Deputy Sarpanch Election) చేపడుతారు.
Panchayat Elections | నగదు పట్టివేత
సిద్దిపేట జిల్లా (Siddipet District) గజ్వేల్ మండలం అక్కారంలో కారులో తరలిస్తున్న రూ. 2.25 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. జగదేవ్పూర్ సర్పంచ్ అభ్యర్థి డబ్బుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.