అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని (Kamareddy district) ఏడు మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం పూట చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మందకొడిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9 గంటల వరకు 21 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఆ తర్వాత పుంజుకుంది. 11 గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదైంది.
Panchayat Elections | మండలాల వారీగా పోలింగ్ శాతం
గాంధారి మండలంలో (Gandhari mandal) 63.49 శాతం పోలింగ్ నమోదైంది. లింగంపేట మండలంలో 53.14 శాతం, మహమ్మద్ నగర్ మండలంలో 54.49 శాతం, నాగిరెడ్డిపేట మండలంలో 56.42 శాతం, నిజాంసాగర్ మండలంలో 61.92 శాతం, పిట్లం మండలంలో 53.97 శాతం, ఎల్లారెడ్డి మండలంలో 64.96 శాతం పోలింగ్ నమోదైంది.
Panchayat Elections | ఏడు మండలాల్లో..
జిల్లాలోని ఏడు మండలాల్లో 1,64,301 మంది ఓటర్లు ఉండగా 78476 మంది పురుషులు, 85822 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 95,115 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇక గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో 65 శాతం ఓటింగ్ నమోదైంది. ఎల్లారెడ్డి మండలంలో అత్యధికంగా రేపల్లెవాడ గ్రామ పంచాయతీలో 94 శాతం పోలింగ్ పూర్తయింది. శివపూర్లో 85 శాతం, మల్లెపల్లిలో 80, సర్దల్పూర్లో 80, వెంకటాపూర్లో 87, కొక్కొండ పంచాయతీలో 80 శాతం ఓటింగ్ నమోదైంది.