- Advertisement -
HomeతెలంగాణBharat Summit | పదేళ్లలో రాజకీయాలు మారిపోయాయి : రాహుల్​గాంధీ

Bharat Summit | పదేళ్లలో రాజకీయాలు మారిపోయాయి : రాహుల్​గాంధీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bharat Summit | ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ rahul gandhi అన్నారు. పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. హైదరాబాద్ hyderabad​లో నిర్వహించిన భారత్​ సమ్మిట్​ Bharat Summit కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు శంషాబాద్​ ఎయిర్​పోర్టులో సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క bhatti vikramarka ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా హైటెక్​ సిటీలో భారత్​ సమ్మిట్​ నిర్వహిస్తున్న ప్రాంతానికి ఆయన చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సామాజిక మాధ్యమాలతో రాజకీయాలు మారిపోయాయని, కొత్త తరం పాలిటిక్స్​లో రావాలని అభిప్రాయ పడ్డారు. అప్పుడే కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి, దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. అయితే రాహుల్​ గాంధీ భారత్​ సమ్మిట్​లో శుక్రవారమే పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన కశ్మీర్​లో ఉగ్రదాడి బాధితులను పరామర్శించడానికి వెళ్లడంతో శనివారం వచ్చారు. ఈ సమ్మిట్‌ నిర్వహించిన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News