Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి

Collector Nizamabad | ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి

అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | స్థానిక సంస్థల ఎన్నికలకు సమర్ధవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. కలెక్టరేట్​లో (Collectorate nizamabad) మంగళవారం గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల షెడ్యూల్ (Local body Elections) వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు ఫొటోలను 24 గంటల్లో తొలగించాలని, బస్టాండ్, రైల్వే స్టేషన్, పెట్రోల్ బంక్ తదితర ప్రదేశాల్లో ఏర్పాటు చేసినవి 48 గంటల్లో, అనుమతి లేని ప్రైవేటు స్థలాల్లో ఉంటే 72 గంటల్లో పూర్తిస్థాయిలో తొలగించాలని సూచించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీకి సంబంధించి రెండు విడతల్లో, గ్రామపంచాయతీలు రెండు విడతల్లో ఎన్నికలు ఉంటాయని, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో సాయా గౌడ్, డీపీఓ శ్రీనివాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.