HomeUncategorizedPolitical crisis in Nepal | నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. మోడీ లాంటి బలమైన నాయకుడిని...

Political crisis in Nepal | నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. మోడీ లాంటి బలమైన నాయకుడిని కోరుకుంటున్న యువత

- Advertisement -

Political crisis in Nepal : నేపాల్‌లో Nepal రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. జెన్‌ జెడ్‌ యువతరం చేపట్టిన నిరసనల హోరు, 30 మంది ఆందోళనకారుల మృతితో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు చెలరేగాయి.

ఈ ఒత్తిడిని తట్టుకోలేక ప్రధాని కేపీ శర్మ ఓలీ Prime Minister KP Sharma Oli తన పదవికి రాజీనామా చేయగా.. దేశ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది. గురువారం (సెప్టెంబరు 11) పలువురు నేపాలీ యువకులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తమ ఆకాంక్షలను వెల్లడించారు.

“కేవలం 35 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చగలమని నిరూపించుకున్నాం. ఇప్పుడు మాకు మోడీ లాంటి బలమైన నాయకుడు కావాలి. దేశ సంక్షేమం ముందు ప్రాధాన్యం ఇవ్వగల డైనమిక్ లీడర్ అవసరం” అని ఒక యువకుడు పేర్కొన్నాడు.

Political crisis in Nepal : వారిదంతా ఒకే మాట‌..

ఇంకొంత మంది యువత.. దేశాన్ని గందరగోళం నుంచి బయటపడేసేది యువ నాయకత్వమే అని స్పష్టం చేశారు. “నేపాల్‌కు Nepal అందరినీ ఏకం చేసే యువ ప్రధాని కావాలి. వ్యక్తిగత, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అసలైన సమస్యలపై దృష్టి పెట్టాలి. ఐక్యతతోనే దేశం ముందుకు సాగుతుంది” అని దీపేంద్ర విశ్వకర్మ అన్నారు.

భారత్ లాగే నేపాల్ కూడా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే సాంకేతిక, ఆర్థిక అభివృద్ధి అవసరమని, దానికి శక్తివంతమైన నాయకుడు తప్పనిసరి అని మరికొందరు వ్యాఖ్యానించారు.

మరోవైపు, కొంతమంది రాజకీయ నేతలపై యువత తీవ్ర విమర్శలు గుప్పించారు. “సుశీలా కర్కీ ప్రధాని కాకూడదు. ఆమెపై ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి దేశాన్ని నడపలేరు. బదులుగా బలరేంద్ర షా, కుల్మాన్ ఘిసింగ్, గోపీ హమాల్ వంటి వారే నాయకత్వం వహించడానికి అర్హులు” అని యువత స్పందించారు.

ఇక ఓలీ రాజీనామా నేపథ్యం గమనిస్తే… జులై 14, 2024న ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జెన్‌ జెడ్‌ ప్రారంభించిన ఉద్యమం, మరణాల సంఖ్య పెరగడంతో ప్రజా ఒత్తిడి పెరిగింది.

చివరికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 77(1) ప్రకారం ఓలీ రాజీనామాను అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్​కి సమర్పించారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటై, త్వరలో ఎన్నికలు నిర్వహించే దిశగా చర్చలు జరుగుతున్నాయి. కానీ నేపాల్‌ యువత మాత్రం ఒకే మాట చెబుతోంది ..“మాకు కావాల్సింది మోడీ Narendra Modi లాంటి బలమైన నాయకుడు!” కావాల‌ని.