ePaper
More
    HomeజాతీయంNagpur Railway Station | నడుస్తున్న రైలులో ఎక్కేందుకు యత్నించి పడిపోయిన యువతి.. ప్రాణాలు కాపాడిన...

    Nagpur Railway Station | నడుస్తున్న రైలులో ఎక్కేందుకు యత్నించి పడిపోయిన యువతి.. ప్రాణాలు కాపాడిన పోలీస్​..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagpur Railway Station | కదులుతున్న రైలులో ఎక్కడం ఎంతో ప్రమాదకరం. ఏ మాత్రం పట్టు తప్పిన ప్లాట్​ఫామ్​కు (Platform) రైలుకు మధ్యలో చిక్కుకు పోయి ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని (Maharashtra) నాగ్​పూర్​లో (Nagpur) ఓ యువతి కదులుతున్న రైలులో ఎక్కడానికి ప్రయత్నించి కింద పడిపోయింది. అక్కడే ఉన్న పోలీస్​ వెంటనే స్పందించి ఆమె ప్రాణాలు కాపాడారు.

    ఓ యువతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కదులుతున్న రైలులో ఎక్కడానికి యత్నించింది. ఈ క్రమంలో పట్టు తప్పి కింద పడిపోయింది. రైలుకు ప్లాట్​ఫామ్​కు మధ్యలోకి ఆమె పడిపోతుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీస్​ ధీరజ్ దలాల్ (Railway policeman Dheeraj Dalal) ఆమెను బయటకు లాగి కాపాడారు. వేగంగా స్పందించి కాపాడిన పోలీసును నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో (Social Media) వైరల్​ అవుతోంది. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

    View this post on Instagram

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...