అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police | ప్రస్తుత కాలానికి అనుగుణంగా పోలీస్స్టేషన్ రైటర్లు శాస్త్ర సాంకేతికతను వినియోగించుకోవాలని అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి (Additional DCP Baswa Reddy) సూచించారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో (Police Commissioner office) కమాండ్ కంట్రోల్ హాల్లో స్టేషన్ రైటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Nizamabad Police | కేసుల పరిశోధనలో నాణ్యత పెంచాలి
ఈ సందర్భంగా అదనపు డీసీపీ స్టేషన్ రైటర్లకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. కేసు పరిశోధనలో భాగంగా కొత్త టెక్నాలజీని వాడే విధానాన్ని ఆయన వివరించారు. కేసు నమోదు నుంచి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేసుకునే వరకు విధివిధానాలను ఆయన తెలియజేశారు. ఈ శిక్షణను మూడు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని.. తదుపరి స్టేషన్ రైటర్స్ సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెళ్లిన తర్వాత తమ సిబ్బందికి ఈ వివరాలను వెల్లడించాల్సి ఉంటుందన్నారు.
కొత్త ఏడాది సందర్భంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉన్నందున ఎలాంటి అపరిచిత లింకులను తెరవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని డీసీపీ సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైం ఏసీపీ వెంకటేశ్వర్ రావు , టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, ట్రైనింగ్ సీటీసీ ఇన్స్పెక్టర్ శివరాం, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.