అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vikarabad | విద్యుత్ షాక్‌తో ఓ హోమ్‌గార్డు (Home Guard) మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయం (Vikarabad District SP Office)లో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా (Rangareddy District) చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఎస్సీ కార్యాలయంలో హోమ్‌గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసు వాహనాలను శుభ్రం చేస్తున్న క్రమంలో ఆయనకు కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి (Vikarabad Government Hospital)కి తరలించారు. విధులకు వెళ్లిన శ్రీనివాస్ విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్పీ నారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
