3
అక్షరటుడే, కామారెడ్డి: Police transfer | కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ల (sub-divisions) పరిధిలో సివిల్ హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీల ప్రక్రియ గురువారం ముగిసింది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడేళ్లు పూర్తిచేసిన ఏఎస్సైలను బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్చంద్ర (SP Rajeshchandra) మాట్లాడుతూ.. ఉద్యోగులు విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, ఆర్ఐలు నవీన్ కుమార్, కృష్ణ, తదితరులున్నారు.