ePaper
More
    HomeతెలంగాణOperation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను రక్షించడానికి ఆపరేషన్​ ముస్కాన్ (Operation Muskaan )​ చేపడుతున్నట్లు తెలిపారు.

    జులై ఒకటి నుంచి నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించనున్నారు. తప్పిపోయిన పిల్లలు, అనాథలు, అక్రమ రవాణా చేయబడుతున్న పిల్లలను గుర్తించి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా ఆపరేషన్ ముస్కాన్ చేపట్టున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 706 పోలీస్ సిబ్బంది, 121 సబ్ డివిజనల్ పోలీస్ బృందాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్​ను అడిషనల్ డీజీపీ చారు సిన్హా (Additional DGP Charu Sinha) విడుదల చేశారు.

    Operation Muskaan | ఏటా కొనసాగుతున్న కార్యక్రమం

    తప్పిపోయిన పిల్లలను కనుగొని తిరిగి వారి కుటుంబాలకు చేర్చడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆపరేషన్​ ముస్కాన్​ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత పదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని అధికారులు చేపడుతున్నారు. ఏటా జులైలో ఆపరేషన్​ ముస్కాన్​ చేపడతారు. ఈ సారి 11 విడత ఆపరేషన్​ చేపట్టడానికి అధికారులు సిద్ధం అయ్యారు. తప్పిపోయిన, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అలాగే బాలకార్మికులకు విముక్తి కల్పించడానికి చర్యలు చేపట్టనున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...