అక్షరటుడే, బోధన్ : Cricket tournament | పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బోధన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో జానకంపేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas) హాజరై బుధవారం టోర్నీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. శారీరకంగా దృఢంగా ఉండాలని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో బోధన్, సాలురా, ఎడపల్లి, రెంజల్ మండలాల నుంచి 25 టీంలు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై రమ, బోధన్ రూరల్ ఎస్సై మశ్చేందర్రెడ్డి పాల్గొన్నారు.
