Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచే విధంగా సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ సాయిచైతన్య సూచించారు.

బోధన్​ రూరల్​ పోలీస్​స్టేషన్​ను (Bodhan Rural police Station) మంగళవారం ఆయన సందర్శించారు. ముందుగా ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది యూనిఫాం టర్న్​ అవుట్​, కిట్​ ఆర్టికల్స్​ను చెక్​ చేశారు.

స్టేషన్​లో కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అండర్​ ఇన్వెస్టిగేషన్​లో (Under investigation) ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్​ పరిధిలో సైబర్​ నేరాలు జరుగుతున్నాయని.. సైబర్​ క్రైం (Cyber Crime) గురించి స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిచాలని సూచించారు. రూరల్​ పోలీస్​స్టేషన్​ మహరాష్ట్రకు దగ్గరగా ఉన్నందున పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

యువత బెట్టింగ్​ యాప్స్ (Betting Apps)​ జోలికి వెళ్లకుండా వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతికేసులో కచ్చితమైన విచారణ చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలని ఎస్సైలకు సూచించారు. పోలీస్​స్టేషన్ పరిధిలో విలేజ్​ ఆఫీసర్లుగా (Village officers) పనిచేసే సిబ్బంది ప్రజలతో మమేకమై గ్రామాల్లో సమస్యలను తమ శక్తిమేర పరిష్కరించాలని సూచించారు.

కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas), రూరల్ సీఐ విజయ్ బాబు (Rural CI Vijay Babu), బోధన్ ఎస్​హెచ్​వో వెంకట నారాయణ, బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, బోధన్ రూరల్ ఎస్సై  మచ్చేందర్, ఎడపల్లి ఎస్సై రమ, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News