HomeతెలంగాణPolice Health Camp | పోలీసు సిబ్బంది డ్యూటీతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి: సీపీ

Police Health Camp | పోలీసు సిబ్బంది డ్యూటీతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి: సీపీ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Police Health Camp | పోలీసులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని సీపీ సాయి చైతన్య (CP Sai chaitanya) సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ రూంలో (Police Command Control Room) పోలీస్​ శాఖ, ఫీనిక్స్​ ఫౌండేషన్​(Phoenix Foundation), శంకర కంటి ఆస్పత్రి (Shankara Eye Hospital) సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీపీ మాట్లాడుతూ.. విధుల్లో ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోవడంతో పలువురు సిబ్బంది రోగాల బారిన పడుతున్నారన్నారు.

ప్రతిఒక్కరూ ఆర్నెళ్ల కొకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. హెల్త్​క్యాంప్​లో సుమారు 450 మంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రొబేషనరీ ఐపీఎస్​ సాయికిరణ్ ips Sai kiran​, అదనపు డీసీపీ (ఏఆర్​) రామచందర్​రావు, బోధన్​ ఏసీపీ శ్రీనివాస్​, అడ్మిన్​(ఏసీపీ) మస్తాన్​ అలీ, రిజర్వ్​ ఇన్​స్పెక్టర్​ శేఖర్​ బాబు, సతీష్​, పోలీస్​ యూనిట్​ మెడికల్​ ఆఫీసర్​ సరళ తదితరులు పాల్గొన్నారు.