ePaper
More
    HomeసినిమాActress Kalpika | ప్రిజం పబ్​ ఘటన.. నటి కల్పికకు షాకిచ్చిన పోలీసులు

    Actress Kalpika | ప్రిజం పబ్​ ఘటన.. నటి కల్పికకు షాకిచ్చిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Actress Kalpika | టాలీవుడ్​ నటి కల్పిక గణేశ్​పై హైదరాబాద్​లోని గచ్చిబౌలి పోలీసులు (Gachibowli Police) కేసు నమోదు చేశారు.

    గచ్చిబౌలిలోని ప్రిజం​ పబ్​లో సిబ్బంది తనపై దాడి చేశారని ఇటీవల కల్పిక (Kalpika) పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్​ 29న తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రిజం​ పబ్ (Prism Pub hyderabad)​కు వెళ్లిన సమయంలో కేక్​ విషయంలో ఆమె వారితో గొడవ పడింది. పబ్​ సిబ్బందితో ఆమె వాగ్వాదం చేసిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. కాగా.. తప్పు హీరోయిన్ కల్పికదే అని పోలీసులు తేల్చారు. తన ఫాలోవర్స్​ కోసమే పబ్​లో కల్పిక కావాలనే హల్​చల్​ చేసినట్లు గుర్తించారు.

    Actress Kalpika | పబ్​ యాజమాన్యం ఫిర్యాదు మేరకు..

    పబ్​లో బిల్ పే చేయకుండా సిబ్బందిపై కల్పిక అసభ్యంగా ప్రవర్తించింది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టడం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియా(Social Media)లో వైరల్​ అయింది. పైగా తనపై పబ్​ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కావాలనే కల్పిక గొడవ పడినట్లు గుర్తించారు. పబ్​ యాజమాన్యం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కోర్టు అనుమతితో నటి కల్పికపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

    Actress Kalpika | పలు చిత్రాలతో ఫేమస్​

    కల్పిక గణేశ్ (Kalpika Ganesh movies) తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఆరెంజ్ సినిమాలో జెనీలియా ఫ్రెండ్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద తదితర చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం ఆఫర్లు లేకుండా ఉన్న ఈమె వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this