2
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | ప్రజలు నిర్భయంగా.. మరో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చని సీపీ సాయిచైతన్య తెలిపారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ (CP Office) కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సీపీ ప్రజలను నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత స్టేషన్ ఎస్సై, సీఐలకు ఫోన్ చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.